మూడోరోజూ ట్రాఫికర్.. సాయంత్రం నరకం చూసిన వాహనదారులు

మూడోరోజూ ట్రాఫికర్.. సాయంత్రం నరకం చూసిన వాహనదారులు
  • వాటర్‌‌ లాగింగ్స్, ధ్వంసమైన రోడ్లతో బేజార్

హైదరాబాద్‌/గచ్చిబౌలి, వెలుగు: భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. మూడ్రోజులుగా కురుస్తున్న వానలతో వెహికల్ మూవ్ మెంట్ స్లోగా ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. గురువారం సైతం మెయిన్ రోడ్లపై వాటర్ లాగింగ్స్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడాల్సి వచ్చింది.  ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయాల్లో ఉదయం 9గంటల నుంచి11.30 గంటల వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్లు ఎక్కువ సంఖ్యలో రోడ్డెక్కడంతో సిటీ రోడ్లు అన్ని వాహనాలతో నిండిపోయాయి.  మెయిన్‌ రోడ్లలో వెహికల్స్ క్యూ కట్టడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు చేతులత్తేశారు. జంక్షన్లలో సిగ్నల్స్‌ ఆపరేట్‌ చేస్తూ ట్రాఫిక్ జామ్‌ కాకుండా చర్యలు తీసుకున్నారు. 

చెరువులా ఐటీ కారిడార్ రోడ్లు..

ఐటీ కారిడార్​లో  రోడ్లు చెరువులను తలపించాయి. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా కార్లలో ఆఫీసులకు రావడం, మెయిన్ రోడ్లపై వరద నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్ అయ్యింది.   జేఎన్టీయూ- బయోడైవర్సిటీ, లింగంపల్లి, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్, శిల్పా లే ఔట్, ఐకియా జంక్షన్ రూట్లలో ఉదయం, సాయంత్రం కి.మీ మేర వెహికల్స్ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.  ట్రాఫిక్​ డైవర్షన్​కారణంగా యూటర్న్​లు క్లోజ్​ చేయడం, వర్షానికి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఐటీ కారిడార్ లోని బయోడైవర్సిటీ నుంచి ఐకియా జంక్షన్ మీదుగా సైబర్ టవర్స్ వరకు బుధవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.