రోడ్డుపై అడ్డంగా ఇసుక లారీలు..భారీగా ట్రాఫిక్ జామ్

రోడ్డుపై అడ్డంగా ఇసుక లారీలు..భారీగా ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఔరంగాబాద్ ఏటిగడ్డ రోడ్డుపై ఇసుక లారీలు అడ్డంగా నిలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉదయం పూట స్కూలుకు, కాలేజీలకు వెళ్లాల్సిన పిల్లలు, ఉద్యోగాలు.. పనుల నిమిత్తం వెళ్లే ఉద్యోగులు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విషయం తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ జామ్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.