నాలుగో క్వార్టర్​లో .. హెచ్​యూఎల్ లాభం రూ. 2,561 కోట్లు

నాలుగో క్వార్టర్​లో .. హెచ్​యూఎల్ లాభం రూ. 2,561 కోట్లు

న్యూఢిల్లీ: ఎఫ్​ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్​యూఎల్)కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ పద్ధతిలో  నికర లాభం 1.53 శాతం క్షీణించి రూ.2,561 కోట్లకు చేరుకుంది. కమోడిటీ ధరలను తగ్గించడం, ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా లాభం తగ్గింది. కంపెనీ క్రితం సంవత్సరం కాలంలో రూ.2,601 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈసారి నికర అమ్మకాలు దాదాపు రూ.15,013 కోట్లకు చేరుకున్నాయి.  

మొత్తం ఖర్చులు 1.15 శాతం పెరిగి రూ.12,100 కోట్లకు చేరగా, ఏడాది క్రితం రూ.11,962 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఎల్ మొత్తం ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి రూ. 15,441 కోట్లుగా ఉంది.  కంపెనీకి 2022–-23లో రూ. 10,143 కోట్ల లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం రూ.10,282 కోట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన సమావేశంలో హెచ్​యూఎల్​ బోర్డు రూపాయి ముఖవిలువ గల షేరుకు రూ.24 చొప్పున ఫైనల్​ డివిడెండ్​ను ప్రతిపాదించింది.