సబ్బుల ధరలు తగ్గిస్తూ హిందుస్థాన్ యూనిలీవర్ నిర్ణయం

సబ్బుల ధరలు తగ్గిస్తూ హిందుస్థాన్ యూనిలీవర్ నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రముఖ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హల్) దీపావళి సందర్భంగా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను  2 నుంచి 19 శాతం వరకు  తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లకు సంబంధించిన ముడి సరకుల ధరలు తగ్గినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు హల్ ప్రకటించింది. పలు ఉత్పత్తులకు సంబంధించి సవరించిన రేట్ల వివరాలను హల్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.

ఇక సవరించిన రేట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్(500ml) ధర ప్రస్తుతం రూ.115 ఉండగా... దీనిపై 3 రూపాయలు తగ్గనుంది. అలాగే రిన్ డిటర్జెంట్ పౌడర్(1 Kg) ధర ప్రస్తుతం రూ.103 ఉండగా... 4 రూపాయలు తగ్గనుంది. లైఫ్ బాయ్ సోప్ ప్యాక్ (4 సబ్బులు each 125g) రేట్ 140 ఉండగా... దీనిపై 8 రూపాయలు తగ్గనుంది. అలాగే డవ్ సోప్ (50g) ధర ప్రస్తుతం 27 ఉండగా సవరించిన రేట్ ప్రకారం రూ.22కే రానుంది.