కాబూల్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..ఎయిర్ స్పేస్ మూసివేత

V6 Velugu Posted on Aug 16, 2021

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఎయిర్ పోర్ట్ రణరంగంగా మారింది. విమానం ఎక్కేందుకు జనం పరుగులు పెట్టారు. దీంతో రద్దీని ఆపేందుకు సైన్యం కాల్పులు జరిపింది. తొక్కిసలాట, కాల్పలు కారణంగా కనీసం ఐదుగురు చనిపోయినట్లు తెలస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీసా అవసరం లేకుండానే కెనెడా తీసుకెళ్తున్నారన్న రూమర్స్ తో కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాది మంది పౌరులు వచ్చారు. మిలిటరీ విమానాల్లో ఎక్కేందుకు ప్రయత్నించారు. కాబూంల్ ఎయిర్ పోర్ట్ అమెరికా సైన్యం ఆధీనంలో ఉండగా... మిలిటరీని లెక్కచేయకుండా రన్ వేపైకి దూసుకొచ్చారు జనం. క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది. జనంపైనా కాల్పులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ మూతపడింది. ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ఆపేశారు. ఎయిర్ స్పేస్ మూసివేసిన కారణంగా నిలిచిన ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా నుంచి భారత్ వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. షికాగో-న్యూఢిల్లీ (AI-126), శాన్‌ఫ్రాన్సిస్కో-న్యూఢిల్లీ (AI-174) విమానాలను గల్ఫ్ దేశాల మీదుగా రీ-ఫ్యూయలింగ్ చేసి భారత్‌కు తరలిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ మీదుగా ప్రయాణించే అనేక విమానాల దారిమళ్లిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు చిక్కుకున్నారు.

 

 

 

 

Tagged Hundreds Jostle, Board, Plane, Desperate, Kabul Airport

Latest Videos

Subscribe Now

More News