
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. తనతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే కనుమరుగైపోగా.. నయన్ మాత్రం వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఇటీవలే షారుఖ్ తో ఆమె చేసిన జవాన్ మూవీ భారీ విజయం సాధించింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మరోసారి నయనతార గ్రాఫ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అంతేకాదు.. జవాన్ విజయంతో రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేసింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే.. ఇటీవలే తన 39వ పుట్టినరోజును జరుపుకుంది నయన్. ఈ సందర్బంగా.. తన భర్త విఘ్నేష్ శివన్ నయన్ కు నాలుగుకోట్ల విలువచేసే ఖరీదైన మెర్సిడీస్ మేబాక్ కారును బహుమతిగా ఇచ్చారట. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు నయన్. అంతేకాదు ఆ మధురమైన క్షణాలకు సంబందించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. నా పుట్టినరోజున నేను తీసుకున్న అత్యంత విలువైన బహుమతి ఇది. నా డియరెస్ట్ హస్బెండ్ విఘ్నేష్‌కు ప్రేమతో కృతజ్ఞతలు.. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో అన్నపూర్ణ్నే, టెస్ట్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.