ఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు

ఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు

పోలీసులు దొంగల్ని పరుగులు పెట్టించడం రొటీన్​ సీనే.. కానీ, సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్​ డివిజన్​లో పోలీసులే ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు. అది కూడా చెమటలుకక్కేలా. ఎందుకలా ? అంటున్నారా! తమ జిల్లాలోని ప్రజలు హెల్దీగా ఉండాలని.. యూత్​ని చెడు వ్యసనాల నుంచి కాపాడాలని మారథాన్స్​ ​ ​ నిర్వహిస్తున్నారు పోలీసులు. గడిచిన రెండు నెలల్లో దాదాపు 28 మారథాన్స్​​​ ​ కండెక్ట్ చేశారు. యువతను పోలీసు, సైనిక ఉద్యోగాల  దిశగా అడుగులేయిస్తున్నారు కూడా.

సిద్దిపేట,వెలుగు:  పోలీసు డ్యూటీ అంటే మాటలు కాదు. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులుగా ఉంటుంది లైఫ్.  అయినా సరే  ఏమాత్రం అలసిపోకుండా డ్యూటీతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు హస్నాబాద్​ డివిజన్​  పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అసలైన నిర్వచనం ఆచరణలో చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుండడంతో రెగ్యులర్ గా   ‘గో  హెల్త్.. గుడ్ హెల్త్’ …  స్లోగన్ తో  2కె, 3కె, 5కె, 10కె, 11కె, 21కె (ఆఫ్ మారథాన్) లాంటి పోటీలు పెడుతూ  అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  ప్రజలు, యువత కూడా ఈ మారథాన్స్​లో ​ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఆలోచన మొదలైంది

‘హెల్త్​ విషయంలో జాగ్రత్త సుమ’ అనేది చెప్పడానికి  అక్కన్నపేట ఎస్​ఐ కొత్తపల్లి రవి ఈ రన్నింగ్​ ఈవెంట్స్​ని స్టార్ట్​ చేశారు. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కు వెళ్లినప్పుడు అక్కడ యువత, ప్రజలు ఖాళీగా కనిపించారట.  దాంతో వాళ్లకి ఏదైనా పనిపై ఆసక్తి కలిగించాలి..ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడేలా చేయాలని మారథాన్స్​  స్టార్ట్​ చేశాడు. మొదట మండల కేంద్రమైన అక్కన్నపేటలో  కొంత మంది యువత, గ్రామ ప్రజలతో కలసి  2కె రన్ కండక్ట్​ చేశారు. అవి సక్సెస్​ అవడంతో  3కె, 5కె ,10కె  మారథాన్స్​ కండక్ట్​ చేశారు. ఆ తర్వాత హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని మిగిలిన మండలాల్లోనూ మారథాన్స్​ స్టార్ట్​ చేశారు. రీసెంట్​గా​ హుస్నాబాద్​లో  రెండు వేల మందితో హాఫ్​ మారథాన్(21 కిలోమీటర్ల) రన్నింగ్ ఈవెంట్​ను కూడా కండక్ట్ చేశారు. విన్నర్స్​కి మెడల్స్​తో పాటు టీషర్ట్స్​ని కూడా బహుమతిగా ఇచ్చారు.

యూత్ కోసమే..

అక్కన్నపేట మండలంలో ప్యాట్రోలింగ్​కి వెళ్లినప్పుడు చాలామంది యూత్ ఖాళీగా కనిపించారు.  వాళ్లు  చెడుదారి పట్టకుండా ఆరోగ్యంగా ఉండాలని రన్నింగ్ ఈవెంట్స్ మొదలుపెట్టా. మారథాన్స్​ గురించి యువతకి అవగాహన కల్పించి పాల్గొనేలా ప్రోత్సహించా. వాళ్లందరి సహకారంతో చిన్నగా ప్రారంభమైన మారథాన్స్​  ఇప్పుడు డివిజన్​లోని అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ప్రజలు, యువత ఆసక్తిని గమనించి  త్వరలోనే   42 కిలో మీటర్ల ఫుల్ మారథాన్ నిర్వహించాలి అనుకుంటున్నాం.. -కొత్తపల్లి రవి, ఎస్ఐ, అక్కన్నపేట.

యూత్​కు ఇది కొత్త బాట

రెగ్యులర్​గా మారథాన్స్​లో పార్టిసిపేట్​ చేస్తున్నా. మారథాన్స్​లో పాల్గొనడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా ఫిట్​గా ఉంటున్నా. రన్నింగ్​పై ఇంట్రెస్ట్​ పెరిగింది. ముందుముందు కూడా మారథాన్స్​లో పాల్గొంటా. అఖిల్, గోవర్థనగిరి

 

పోలీసు అన్నలకి థాంక్స్

పోలీస్ యూనిఫాం వేసుకోవాలనేది నా కల. ఆ కలని నిజం చేసుకోవాలంటే బాడీ ఫిట్​గా ఉండాలి. అందుకే రెగ్యులర్​గా మారథాన్స్​లో పార్టిసిపేట్​ చేస్తున్నా.  ఇప్పటికే  2కే, 5కే  ఈవెంట్స్ లో  పాల్గొని విజయం సాధించా ,  హుస్నాబాద్​లో జరిగిన  10కే రన్  లో పాల్గొని 12 వ స్థానంలో నిలిచా. ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల రన్నింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది.  ఇదంతా పోలీస్​ అన్నల వల్లే సాధ్యమైంది అందుకే వాళ్లకి బిగ్ థాంక్యూ. -రాజేశ్, కొహెడ

 

ప్రజల ఆరోగ్యం కోసం..

ప్రజల ఆరోగ్యంతో పాటు యువతకు ఒకదారి చూపించేందుకే మారథాన్స్​ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు డివిజన్​ పరిధిలో 28 ఈవెంట్స్​ కండక్ట్​చేశాం. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకి ఈ మారథాన్స్​ని పరిచయం చేయాలనుకుంటున్నాం. రీసెంట్​​గా హుస్నాబాద్​లో నిర్వహించిన హాఫ్ మారథాన్​కి మంచి ఆదరణ వచ్చింది.  ఇతర జిల్లాలనుంచి కూడా ఈ మారథాన్​కి పెద్ద ఎత్తున జనాలొచ్చారు. జిల్లాలోని ఆడవాళ్లు కూడా ఈ మారథాన్​లో యాక్టివ్​గా పార్టిసిపేట్ చేస్తున్నారు.  ఫ్యూచర్​లోనూ మారథాన్స్​ని కంటిన్యూ చేస్తాం. -సందెపోగు  మహేందర్, ఏసీపీ హుస్నాబాద్.

 

ఇవి కూడా చదవండి

విదేశాల ​వైపు సంపన్నుల పరుగు

ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మార్కెట్ అనుకూలం

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌