ట్రోల్ చేస్తే తోలు తీస్త కాంగ్రెస్, బీజేపీకి కౌశిక్ రెడ్డి వార్నింగ్

ట్రోల్ చేస్తే తోలు తీస్త కాంగ్రెస్, బీజేపీకి కౌశిక్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​, బీజేపీ వాళ్లు సోషల్​ మీడియాలో తనను ఇష్టమొచ్చినట్టు ట్రోల్స్​ చేస్తున్నారని, అలాంటి వాళ్ల తోలు తీస్తామని హుజూరాబాద్ ​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి హెచ్చరించారు. వంగర గురుకుల స్కూల్​లో ఓ స్టూడెంట్​ సూసైడ్​ చేసుకుని చనిపోతే.. ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆయన  విమర్శించారు. ఆ స్కూల్​ ప్రిన్సిపాల్​ను సస్పెండ్​ చేయకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​తో కలిసి శనివారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. 

చనిపోయిన విద్యార్థిని స్కూల్​లో టాపర్​ అని, ఆ అమ్మాయిని స్కూల్​ ప్రిన్సిపాల్​, వైస్​ప్రిన్సిపాల్​ వేధించారని ఆరోపించారు. స్కూల్ లోని సరుకులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్  తీసుకువెళ్తుంటే ఆ అమ్మాయి చూసిందని, దీంతో ఆమెను వాళ్లు తీవ్రంగా వేధించారని అన్నారు.  ఆర్ఎస్  ప్రవీణ్​  మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్​ నియోజకవర్గ పరిధిలో గురుకుల విద్యార్థిని చనిపోతే కనీసం అక్కడకు వెళ్లలేదని విమర్శించారు.