
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. . దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పరిచయం చేయనున్నారు కేసీఆర్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన గెల్లు శ్రీనివాస్... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, LLB పూర్తి చేశారు. ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ PHD చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.