
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పేందుకు సిటీ సిద్ధమైంది. శనివారం రాత్రి మాస్ గ్యాదరింగ్స్, స్పెషల్ ఈవెంట్స్ తో ధూంధాంగా వేడుకలు నిర్వహించేందుకు నగరవాసులు, ఈవెంట్ఆర్గనైజర్లు ప్లాన్ చేశారు. చిన్న చిన్న కన్వెన్షన్ సెంటర్ల నుంచి రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు సందడిగా మారనున్నాయి. అలాగే సిటీలోని రీక్రియేషన్ సెంటర్లు, టూరిజం ప్లేసులు, రెస్టారెంట్లు, లేక్‌వ్యూలు న్యూ ఇయర్ వేడుకలకు అడ్డాగా మారనున్నాయి. థర్టీ ఫస్ట్ నైట్ఈవెంట్లకు ఎంట్రీ టికెట్లు రూ.499 నుంచి మొదలవుతున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫుల్ క్రౌడ్‌తో ఈ సారి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయని, బుకింగ్స్ ఓపెన్ చేశామని ఆర్గనైజర్లు తెలిపారు. ఎంట్రీ పాసులు పేటీఎం ఇన్‌సైడర్, బుక్ మై షో, మేరా ఈవెంట్లలో అందుబాటులో ఉన్నాయి.
స్పెషల్ ఈవెంట్లదే హవా..
మాదాపూర్‌లోని మెరిడియన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ ఎన్‌వైఈ బాష్ 2023 జరగనుంది. ఎంట్రీ పాస్ రూ.499 నుంచి మొదలవుతుంది. ఇక్కడ శనివారం రాత్రి 8 గంటల నుంచి జనవరి 1న ఒంటిగంట వరకు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. టాప్ డీజేలతో మ్యూజిక్, బాలీవుడ్, పంజాబీ, కమర్షియల్, హిప్‌హాప్ మ్యూజిక్ ప్లే చేయనున్నారు. ఇందులో బఫెట్‌కి సెపరేట్ సెక్షన్, డ్రింక్స్, లైవ్ ఫుడ్ కౌంటర్, బార్స్, ఫొటోగ్రాఫీ, ఫన్ పార్టీ ప్రాప్స్, స్పెషల్ కౌంట్ డౌన్ ఉంటాయి. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. గౌలిదొడ్డిలోని ప్రిజమ్ కబ్ల్ అండ్ కిచెన్‌లో ఎన్‌వై ఈ 2023– ది ప్రిజమ్ సర్కస్ 2.0 పేరుతో జరగనుంది.
శనివారం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర రూ.4 వేల నుంచి మొదలవుతుంది. ఓమ్ కన్వెన్షన్ సెంటర్‌లో దర్శన్ రావల్ డీజే వినిష్ లైవ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు ఎంట్రీ టికెట్ రూ.999 నుంచి ఉంది. రాత్రి 7 గంటల నుంచి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. తాజ్‌డెక్కన్‌లో న్యూ ఇయర్ ఈవ్ పేరుతో సెలబ్రేషన్స్ జరగనున్నాయి. రూ.2,499 నుంచి ఎంట్రీ ఉంది. ఆమ్నేషియా స్కై బార్‌లో న్యూ ఇయర్స్ ఈవ్ 2023 పేరుతో డీజే మోరీషా స్పెషల్ ఈవెంట్ జరగనుంది. 2,999 నుంచి ఎంట్రీ ఫీజు ఉంది. ఇలా సిటీలోని చాలాచోట్ల సెలబ్రేషన్స్జరుగుతున్నాయి. ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్, లైవ్ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఓపెన్ ఏరియాల్లో..
స్పెషల్ఈవెంట్లతోపాటు సిటీలోని హాంగవుట్ ప్లేసుల్లోనూ ఈసారి వేడుకలు భారీగా జరగనున్నాయి. ఈవెంట్లకు వెళ్లనివారు లవ్ హైదరాబాద్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సిటీలోని లేక్‌లు, హోటళ్లు, రిసార్ట్‌లు, క్యాంపింగ్ ప్రదేశాల్లో సెలబ్రేట్చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిటీ శివార్లలో థీమ్ రిసార్ట్‌లు పెరిగిపోవడంతో చాలామంది అక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, గేమ్స్ న్యూఇయర్‌కు వెల్కమ్ చెప్పనున్నారు.
ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో రూల్స్ ఇవీ..
- పరిమితికి మించి పాసులు, టికెట్స్, కూపన్లు ఇవ్వొద్దు
- ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్లేసెస్‌లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి సెక్యూరిటీ గార్డులతో భద్రతా,
- ట్రాఫిక్ ఏర్పాట్లు చేసుకోవాలి
- కత్తులు, ఇతర వెపన్లను అనుమతించకూడదు
- అసభ్యకర డ్యాన్స్‌లు, యాక్టింగ్స్‌కు అనుమతి లేదు
- పబ్స్, బార్స్‌లో జరిగే ఈవెంట్స్‌కు మైనర్లను అనుమతించకూడదు
- 45 డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్ ఉండకూడదు
- వెహికల్స్ కోసం స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి
- రూల్స్ పాటించని నిర్వాహకులపై చర్యలు
సందేశాత్మక కేకులు
బేగంపేటలోని ఓ బేకరీలో సోషల్ మెసేజ్‌లతో తయారు చేసిన న్యూ ఇయర్ కేకులు ఆకట్టుకుంటున్నాయి. ప్లీజ్ వేర్ మాస్క్, వరల్డ్ పీస్, డిజిటల్ ఇండియా, లవ్ హైదరాబాద్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ‘సే యస్ టు లైఫ్- సే నో టు డ్రగ్స్’ అనే పలురకాల మెసేజ్‌లతో కేకులు అందుబాటులో ఉన్నాయి.