51 చోరీ కేసులున్న ఘరానా దొంగ అరెస్ట్

51 చోరీ కేసులున్న ఘరానా దొంగ అరెస్ట్

హైదరాబాద్: తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా పలు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన  ఘరానా దొంగ సద్దాం అలి ని అరెస్ట్ చేశామని నగర పోలిస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. నిందితుడు అరెస్ట్ చేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిందితుడు అలి నుంచి 17 లక్షల రూపాయలు విలువచేసే  45తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

మౌలాలి ప్రాంతానికి చెందిన సద్దాం అలి వెల్డింగ్ పని చేస్తుండేవాడని, అతనిపై 51 చోరీ కేసులు నమోదై వున్నాయని చెప్పారు. 2015 లో తన మిత్రుడైన పోతు రాజు తో కలిసి చోరీలు చేసిన కేసులో సద్దాం రిమాండ్ అయ్యాడని తెలిపారు. ఇటీవలే నల్లకుంట, చిలకలగుడా పిఎస్ పరిధి లో సద్దాంపై రెండు చోరీ కేసులు నమోదయ్యాయని..ఈ కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్ గా వున్నాడని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరెట్ పరిధిలో అరెస్ట్ అయ్యారన్నారు .

2017 లో మరోసారి పోతు రాజు తో కలిసి సద్దాం అలి 15 చోరీ లు చేశాడని, 2020 జనవరి లో జైల్ నుండి విడుదల అయి.. బయటికి రాగానే మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడని చెప్పారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్క ప్రణాళికతో సద్దాం ను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.