
- హయత్‌నగర్, కుంట్లూరులోని 5 హాస్పిటళ్లలో టీజీఎంసీ తనిఖీలు
ఎల్బీనగర్, వెలుగు: ఎంబీబీఎస్చదవలేదు.. కానీ ఆ స్థాయి వైద్య సేవలందిస్తూ ప్రజలను మోసం చేస్తున్నరు.. నిందితుల్లో ముగ్గురిపై కేసు నమోదవగా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. హయత్నగర్సీఐ నాగరాజుగౌడ్, టీజీఎంసీ వైస్చైర్మన్డాక్టర్గుండగాని శ్రీనివాస్తెలిపిన వివరాల ప్రకారం.. వరుస ఫిర్యాదులు వస్తుండడంతో టీజీఎంసీ బృందం గురువారం హయత్‌నగర్, కుంట్లూరు పరిధిలోని పలు క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. కుంట్లూరులో సన్రేస్హాస్పిటల్, డయాగ్నోస్టిక్సెంటర్లో డాక్టర్ఉమాకాంత్ బీఏఎంఎస్ చదివి, అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.
హయత్‌నగర్‌లో శ్రీ విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో విశ్వనాథుల రాఘవాచారి, హనుమాన్ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఇంటర్చదివిన వనం వినోద్ కుమార్డాక్టర్లుగా చెప్పుకుంటూ ఎంబీబీఎస్డాక్టర్చేసే వైద్యం చేస్తున్నట్లు తేల్చారు. శ్రీసాయి పాలీ క్లినిక్ లో డాక్టర్ కేఎస్.ప్రసాద్ బీహెచ్ఎంఎస్ చదివి, ఎంబీబీఎస్ గా ప్రచారం చేసుకుంటూ, బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో కొంపల్లి రాంబాబు అనే వ్యక్తి ట్రీట్మెంట్చేస్తున్నట్లు గుర్తించారు.
వీరు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని టీజీఎంసీ వైస్‌చైర్మన్ పేర్కొన్నారు. డాక్టర్ఉమాకాంత్, డాక్టర్కేఎస్.ప్రసాద్ కు నోటీసులు ఇచ్చామన్నారు. రాంబాబు, రాఘవాచారి, వినోద్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుంట్లూరు రోడ్లో కొంతమంది క్లినిక్‌లు, ఆస్పత్రులు మూసివేసి పారిపోయారన్నారు. త్వరలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నకిలీ వైద్యుల వివరాలనుantiquackerytsmc@onlinetsmc.in కు తెలియజేయాలని కోరారు. డాక్టర్కేయూఎన్.విష్ణు, విజిలెన్స్ఆఫీసర్రాకేశ్
తదితరులున్నారు.