ఈసారి గణేశ్ ఉత్సవాల్లో లక్ష విగ్రహాలు.. ట్యాంక్బండ్ లో 70 వేల విగ్రహాల నిమజ్జనం

ఈసారి గణేశ్  ఉత్సవాల్లో  లక్ష విగ్రహాలు.. ట్యాంక్బండ్ లో 70 వేల విగ్రహాల నిమజ్జనం
  • జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం​ ప్రభాకర్​
  • ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం
  • హాజరైన మేయర్, డీజీపీ, బల్దియా, హెచ్ఎండీఏ కమిషనర్లు,
  • భాగ్యనగర్, బాలాపూర్, ఖైరతాబాద్ గణేశ్​ ఉత్సవ సమితి సభ్యులు

హైదరాబాద్ సిటీ. వెలుగు: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేలా గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని హైదరాబాద్ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  జూబ్లీహిల్స్​ఎంసీహెచ్​ఆర్​డీలో గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, డీజీపీ జితేందర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్​డీజీపీ మహేశ్ భగవత్, అగ్నిమాపక డీజీ నాగి రెడ్డి,  హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్,  రాచకొండ సీపీ సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మేడ్చల్– మల్కాజ్ గిరి కలెక్టర్ మను చౌదరి,ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్  పాల్గొన్నారు. 

మంత్రి మాట్లాడుతూ మూడు కమిషనరేట్ల పరిధిలో లక్ష వినాయక విగ్రహాలు ఏర్పాటు కానున్నాయని, ఇందులో 70 వేల విగ్రహాలు ట్యాంక్ బండ్ కు వస్తాయన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి మండపం వద్ద విద్యుత్ ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాంప్లెట్స్​ముద్రించి పంపిణీ చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఉత్సవాల్లో శాఖలు తమకు ఇచ్చిన బాధ్యతల విషయంలో  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

రూ.51 కోట్లతో  ఏర్పాట్లు : జీహెచ్ఎంసీ కమిషనర్ 

ఈ ఏడాది రూ.51 కోట్ల గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నట్లు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 20 పెద్ద చెరువుల్లో నిమజ్జనం ఉంటుందని, ఆర్టిఫీషియల్ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నిమజ్జనాలు జరిగే రోడ్లలో ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నామన్నారు. 27 పర్మినెంట్ బేబీ పాండ్స్ తో  పాటు 24 టెంపరరీ పాండ్స్, 23 ఎక్సావేషన్ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 403 క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నాయని, ఇందులో మూవింగ్ క్రేన్స్ కూడా ఉంటాయన్నారు. 

56,187 టెంపరరీ లైట్స్ ఏర్పాటు చేస్తున్నామని,  166 శానిటేషన్ టీమ్స్ ని నియమిస్తున్నామని, 303 కిలోమీటర్ల గ్రేటర్ లో ప్రతి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో చెత్త  క్లీనింగ్ చేస్తారన్నారు. 14,486 మంది శానిటేషన్ వర్కర్లు ఫీల్డ్ లో ఉంటారన్నారు. ప్రత్యేకంగా 13 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులన్నింటికి టెండర్లు వేసామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. 

కరెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

డిస్కం పరిధిల లక్ష కిలోమీటర్ల ఎలక్ట్రిక్ లైన్ ఉందని, ఈ పరిధిలో 9,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఈ సిబ్బంది ఇన్ని కిలోమీటర్ల ను షిఫ్ట్ వైజ్ చూసుకున్నా ఇబ్బందిగానే ఉంటుందని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్​ఎండీ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. గతేడాది నుంచి మండపాల కు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోందన్నారు. ట్రాన్స్​కో ఎండీ ముషారఫ్ ఫారుఖీ