వాటర్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

వాటర్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ అవార్డు
  • నీటి సంరక్షణ, సరఫరాలో  అత్యుత్తమ ఫలితాలకు ప్రకటన 
  • రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న  బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: నీటి సంరక్షణ, సరఫరాలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మెట్రోవాటర్​బోర్డుకు కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌‌ టాప్ మున్సిపల్​కార్పొరేషన్ కేటగిరీలో ఈ అవార్డు ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఈ అవార్డుతో పాటు రూ.2 కోట్ల ప్రోత్సాహకం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది స‌‌మష్టి కృషి వ‌‌ల్లే ఈ అవార్డు వ‌‌చ్చింద‌‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి బోర్డు అధికారుల‌‌పై న‌‌మ్మకం ఉంచి ప్రోత్సహించ‌‌డం, హైదరాబాద్ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో తాము విజయవంతంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.