పుదుచ్చేరిపై బౌలర్స్ అదుర్స్.. రంజీ ట్రోఫీలో తొలి విజయం దిశగా హైదరాబాద్

పుదుచ్చేరిపై బౌలర్స్ అదుర్స్.. రంజీ ట్రోఫీలో తొలి విజయం దిశగా హైదరాబాద్

పుదుచ్చేరి: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తొలి విజయం దిశగా సాగుతోంది. బౌలర్లు సత్తా చాటడంతో పుదుచ్చేరితో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టు బిగించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 25/1తో  ఆట కొనసాగించిన పుదుచ్చేరి మూడో రోజు, సోమవారం చివరకు 92/8తో కష్టాల్లో పడి ఫాలోఆన్ ముంగిట నిలిచింది. వర్షం కారణంగా మూడో రోజు 25 ఓవర్ల ఆటే సాధ్యం కాగా.. బి. పున్నయ్య (3/10), తనయ్ త్యాగరాజన్ (2/41) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. 

ఆనంద్ బియాస్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ప్రస్తుతం అమన్ ఖాన్ (8 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కరణ్ కన్నన్ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  హైదరాబాద్ స్కోరు (435)కు పుదుచ్చేరి ఇంకా 343 రన్స్ దూరంలో ఉంది. ఫాలోఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పించుకోవాలన్నా.. మరో 285 రన్స్ చేయాలి.  మంగళవారం ఆటకు చివరి రోజు.