
ఖైరతాబాద్ వెలుగు: ‘కొండ పొలం’ సినిమాలో హీరో పేరును మార్చాలని హైదరాబాద్ పాల మూరు కురుమ సంఘం డిమాండ్ చేసింది. శని వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్ కురుమ మాట్లాడుతూ గొర్రెల కాపరి ఇతివృత్తంతో తీసిన ‘కొండ పొలం’ సినిమాలో హీరో పేరును రవీంద్ర యాదవ్ గా పెట్టారని, రవీంద్ర కురుమగా మార్చాలని పేర్కొన్నారు. గొర్రెలు కాయడం యాదవుల వృత్తి కాదని, అది కురుమల వృత్తి అని తెలిపారు. సినిమా విడుదల లోపు హీరో పేరు మార్చాలని, లేకుంటే థియేటర్ల ముందు నిరసన తెలిపి, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఫిలిం ఛాంబర్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ఆఫీస్ లో వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. కురుమ సంఘం సభ్యులు కురుమ శ్రీనివాస్, రాము, కృష్ణ, రామ చందర్, కేవైసీఎస్ సభ్యులు పాల్గొన్నారు.