ఎంజాయ్మెంట్ పేరుతో ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు

ఎంజాయ్మెంట్ పేరుతో ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు

హైదరాబాద్: నయా సాల్.. నయా జోష్ కు అంతా రెడీ అయింది. న్యూ ఇయర్ వేడుకులకు సిటీలోని పబ్స్, రెస్టారెంట్లు ఏర్పాట్లు చేశాయి. ఇంకేముంది ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేద్దాం. మందేసి... చిందేద్దాం అనుకుంటున్నారా? అయితే కండిషన్స్ అప్లై అంటున్నారు పోలీసులు. తేడా వస్తే రూల్స్ వర్తిస్తాయంటున్నారు. ఎంజాయ్ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎంజాయ్ చేయండి కానీ.. రోడ్ల మీద రచ్చ చేస్తామంటే ఊరుకునేది లేదని ముందే వార్నింగ్ ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని, మాస్క్ పెట్టుకోకుంటే చర్యలు తప్పవన్నారు. 

న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవు

మద్యం తాగి వాహనాలు నడిపినా.. రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి వంద స్పెషల్ టీమ్ లతో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే భారీగా జరిమానా, జైలు శిక్ష ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు.. బేగంపేట, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే తప్ప అన్ని  ఫ్లై ఓవర్లు బంద్ పెడుతున్నారు. 

షరతులు వర్తిస్తాయ్

ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో న్యూ ఇయర్  వేడుకలకు అడ్డంకి తొలగిపోయిందనుకునే లోపే.. షరతులు వర్తిస్తాయంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సిటీలో ఏటా క్రేజీగా సాగే 31వ తేదీ నైట్ పార్టీలు కాస్త గప్ చుప్ అయ్యాయి. ఏటా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున.. సిటీలో సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఏడాది మాత్రం సిటీలో న్యూ ఇయర్ సందడి అంతగా కనపడటం లేదు. కరోనా గైడ్ లైన్స్, ప్రభుత్వ ఆంక్షలతో పెద్దగా సందడి కనిపించడం లేదు. లిమిటెడ్ మెంబర్స్ తో ఈవెంట్స్ నిర్వహించుకోవాలనడంతో.. న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పే పార్టీలు 30 శాతం కూడా కనపడట్లేదు.

కఠిన రూల్స్.. తగ్గిన ఈవెంట్స్

కరోనా ఆంక్షలు పెడుతూ కూడా ప్రభుత్వం సెలబ్రేషన్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఈవెంట్ ఆర్గనైజర్లు హడావిడిగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఇంకొందరు ముందస్తుగా ఈవెంట్స్ కు ప్లాన్ చేసుకున్నారు. గతేడాదిలా చివరి క్షణంలో ఏర్పాట్లు రద్దు చేసుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు న్యూ ఇయర్ ఈవెంట్స్ కు దూరంగా ఉన్నారు. అయితే ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని.. పబ్ లు, రెస్టారెంట్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఈవెంట్లు నిర్వహించాలని పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. జనాలను ఇబ్బంది పెట్టొద్దని.. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం: 

అడవిలో కార్చిచ్చు.. 90 వేల మంది రెస్క్యూ క్యాంపులకు 

భారత్‌లోనే ఉంటా: పాక్ టెర్రరిస్ట్ భార్య

విశ్లేషణ: ఆడవాళ్లకు ఇంకెన్నాళ్లీ సంకెళ్లు?