హైదరాబాద్ లోని కాస్మెటిక్ షాపుల్లో పాకిస్థాన్ లో తయారైన ప్రాడక్ట్స్ అక్రమంగా అమ్ముతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో పలు ఏరియాల్లోని షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. గురువారం ( అక్టోబర్ 1 ) నిర్వహించిన ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లోని నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ ఏరియాల్లోని కాస్మెటిక్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు.
ఈ తనిఖీల్లో మేడ్ ఇన్ పాకిస్థాన్ లేబుల్ తో ఉన్న వస్తువులు అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. అంతే కాకుండా కొన్ని షాపుల్లో ప్రాణాంతకమైన కెమికల్స్ తో తయారు చేసిన ఫేస్ క్రీములు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సహా ఇతర దేశాల నుంచి అక్రమంగా స్కిన్ వైటనింగ్ క్రీములు తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. దీంతో పాటు లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్టోర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
బ్యూటీ క్వీన్, బ్యూటీ లేడీస్ ఎంపోరియం, ఎస్‌జే మెడికల్ స్టోర్ వంటి షాపుల నుంచి భారీగా అక్రమ క్రీమ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ షాపుల్లో అమ్ముతున్న క్రీముల్లో ప్రమాదకర రసాయనాలు, మెర్క్యురీ లాంటి పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఇలాంటి క్రీమ్స్ వాడితే చర్మ వ్యాధులు, తీవ్రమినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు పోలీసులు.
ALSO READ : పెద్దపల్లి రాజీవ్ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు..
ఇన్స్టంట్ గలౌ అంటూ మార్కెట్ లో అమ్ముతున్న క్రీములు ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆన్‌లైన్‌లో, లోకల్ మార్కెట్లలో ఇలాంటి క్రీమ్స్ కారణంగా మంట, మొటిమలు, చర్మం నల్లబడటం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ స్టోర్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి అక్రమ దందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.
