కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్‌‌‌‌ కొడుకు సాహిల్‌‌‌‌ పిటిషన్

కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్‌‌‌‌ కొడుకు సాహిల్‌‌‌‌ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు చెంది న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ తనపై పోలీసు లు ఎఫ్ ఐఆర్​ను నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మ ణ్‌‌‌‌ గురువారం విచారించి పోలీసులకు నోటీ సులు జారీ చేశారు. కౌంటర్‌‌‌‌ వేయాలని ఆదేశించారు. విచారణను జూన్‌‌‌‌ 11కి వాయిదా వేశారు. కేసు దర్యాప్తు నిలుపుదల ఆదేశాల జారీకి నిరాకరించారు. అయితే, పంజాగుట్ట రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడంటూ సాహిల్​పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన సాహిల్.. రోడ్డు ప్రమాదం ఘటన వద్ద హెచ్చరిక బోర్డులు ల్లేవని తెలిపాడు. రాత్రి వేళ చీకటి కారణంగానే బారికేడ్లను ఢీకొట్టినట్టు చెప్పాడు. చిన్న కేసును పోలీసులు కావాలని పెద్దది చేశారని, 13 మందిని నిందితులుగా చేర్చారని పేర్కొన్నాడు. అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరాడు. పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారని, కింది కోర్టు బెయిల్‌‌‌‌ ఇచ్చిందన్నారు. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేయొద్దన్నారు. ఇదే కేసులో మరో నిందితుడు నాని వేసిన పిటిషన్‌‌‌‌ను కూడా హైకోర్టు విచారించి పోలీసులకు నోటీసులు జారీ చేసింది.