పుదుచ్చేరి: బ్యాటింగ్‌లో రాణించిన హైదరాబాద్.. పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్–డి ఎలైట్ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (114), హిమతేజ (66), రాహుల్ రాధేశ్ (81) చెలరేగడంతో.. 255/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 134.5 ఓవర్లలో 435 రన్స్‌కు ఆలౌటైంది.
రెండో వికెట్‌కు 168 రన్స్ జోడించి రాహుల్, హిమతేజ ఔటయ్యారు. వరుణ్ గౌడ్ (0) విఫలమైనా.. ఓ ఎండ్‌లో రాహుల్ రాధేశ్ నిలకడగా ఆడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రోహిత్ రాయుడు (34)తో ఆరో వికెట్‌కు 105 రన్స్ జత చేశాడు. చివర్లో చామ మిలింద్ (4), తనయ్ త్యాగరాజన్ (14), అనికేత్ రెడ్డి (18) విఫలమయ్యారు. సాగర్ ఉదేశి 4, జయంత్ యాదవ్, కరన్ కన్నన్ చెరో రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 25/1 స్కోరు చేసింది. గంగా శ్రీధర్ రాజు (6 బ్యాటింగ్), ఆనంద్ బైస్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పారస్ రత్నపరాకి (5) నిరాశపర్చాడు. పున్నయ్య ఒక్క వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం పుదుచ్చేరి 410 రన్స్ వెనకబడి ఉంది.
