కాచిగూడ - కాకినాడ మధ్య 19 నుంచి దసరా స్పెషల్ రైలు

కాచిగూడ - కాకినాడ మధ్య 19 నుంచి దసరా స్పెషల్ రైలు

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్ 19 నుంచి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. రైలు నెం. 07653 (కాచిగూడ టు కాకినాడ టౌన్) కాచిగూడ నుంచి రాత్రి 9.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. 

అక్టోబర్ 20 నుంచి 29 తేదీల మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్ నెం 07654 (కాకినాడ టౌన్ - కాచిగూడ) కాకినాడ టౌన్ నుండి సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 1వ AC, AC II టైర్, AC III టైర్, స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లలో ప్రయాణికులు ప్రయాణించవచ్చు.