V6 News

ఎంఎంసీలో 15 కొత్త థీమ్ పార్కులు

ఎంఎంసీలో 15 కొత్త థీమ్ పార్కులు
  • స్పోర్ట్స్​ప్రియుల కోసం స్పోర్ట్స్​పార్కు, 
  • మ్యూజిక్​ లవర్స్​ కోసం మ్యూజికల్ ​పార్కు 
  • ఒక్కో థీయ్​తో ఒక్కోటి డెవలప్ చేయాలని అధికారుల నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరవాసులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించేందుకు థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని  ఎంఎంసీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కొత్తగా15 థీమ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్లాన్లు సిద్ధం చేశారు. కేవలం చెట్లు, బెంచీలు మాత్రమే కాకుండా, ప్రతి పార్కును ప్రత్యేక థీమ్ తో తీర్చిదిద్దనున్నారు. క్రీడా ప్రేమికుల కోసం ‘స్పోర్ట్స్ పార్క్’, పర్యావరణ ప్రియుల కోసం ‘బటర్ ఫ్లై’, ‘బర్డ్స్ పార్క్’,  సంగీత ప్రియుల కోసం ‘మ్యూజికల్ కాన్సెప్ట్ పార్క్’లను ఏర్పాటు చేయనున్నారు. ‘చేతి వృత్తుల’ కాన్సెప్ట్​తో కూడా పార్కు సిద్ధం చేయనున్నారు. పచ్చదనానికే కాకుండా, జ్ఞానాన్ని, వినోదాన్ని పంచేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు ఎంఎంసీ అధికారులు చెప్తున్నారు.   

ఈ థీమ్స్​తో ఏర్పాటు....

 స్పోర్ట్స్ థీమ్ పార్క్, బర్డ్స్ థీమ్ పార్క్, రాక్ గార్డెన్ థీమ్ పార్క్ (తక్కువ నీటితో పెరిగే మొక్కలు), బటర్ ఫ్లై థీమ్ పార్క్, రాశి వనం థీమ్ పార్క్, ఫ్రాగ్రెన్స్ గార్డెన్ థీమ్ పార్క్ (సువాసననిచ్చే సుగంధ ద్రవ్యాల మొక్కల తోట), పాల్మేటం థీమ్ పార్క్ (తాటి జాతి మొక్కల పార్క్), మ్యూజికల్ కాన్సెప్ట్ థీమ్ పార్క్, ఆక్యుపేషనల్ థీమ్ పార్క్ (చేతి వృత్తుల కాన్సెప్ట్), రెయిన్​బో గార్డెన్ థీమ్ పార్క్ (ఇంద్రధనస్సు రంగుల తోట),రోజ్ గార్డెన్ (గులాబీ తోట),పేట్రియాటిక్ థీమ్ పార్క్ (దేశభక్తి నేపథ్య పార్క్), సీజనల్ థీమ్ పార్క్, యానిమల్ కింగ్‌‌‌‌‌‌‌‌డమ్ థీమ్ పార్క్, మేజ్ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.