రేపట్నుండి 18 ఏళ్లు నిండిన వారికి కోవిన్ వాక్సిన్

రేపట్నుండి 18 ఏళ్లు నిండిన వారికి కోవిన్ వాక్సిన్
  • హైదరాబాద్ లో 100 వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్: 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిన్ వ్యాక్సిన్ వేయాలని జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం హైదరాబాద్ నగరంలో  100 కోవిన్ ( CoWin ) వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.  రేపు గురవారం  జూలై 1 నాటికి 18 సంవత్సరాలు దాటిన పౌరులందరికీ వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది శ్రీకారం చుడుతోంది.
ఇప్పటి వరకు 30 ఏళ్లు దాటిన వారికి మాత్రమే నగరంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాక్సిన్ కేంద్రాల ద్వారా ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఇస్తున్న ప్రత్యేక కాటగిరి వారికి మాత్రమే కాకుండా 18  ఏళ్లు దాటిన వారందరికీ  రేపటి నుండి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 
అయితే, వాక్సిన్ తీసుకునే వారు తప్పని సరిగా తమ పేర్లను కోవిన్ పోర్టల్ లో ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే ఆయా కేంద్రాలలో వాక్సిన్ ఇస్తారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ద్వారా 35 ఏళ్లు నిండిన హై రిస్క్ గ్రూపులైన వారికి, స్వయం సహాయక మహిళలకు మాత్రమే వాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.