V6 News

పొద్దంతా ఎండ.. సాయంత్రం చిరుజల్లులు

 పొద్దంతా ఎండ.. సాయంత్రం చిరుజల్లులు
  • సిటీలో చల్లబడిన వాతావరణం..
  • నేటి నుంచి భారీ వానలు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: పొద్దంతా తీవ్రమైన ఎండ కొట్టి ఉక్కపోతతో అల్లాడిన సిటీజనం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కాసింత సేద తీరారు.  వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం వరకు 39డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆ తర్వాత దట్టమైన మేఘాలతో సిటీ కూల్ అయ్యింది.

సాయంత్రం 5 నుంచి 7గంటల మధ్యలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ చెప్పినప్పటికీ పలుచోట్ల చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. ఖైరతాబాద్ లో తేలికపాటి(0.95 సెంటిమీటర్ల) పడింది. మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్లో అలెర్ట్ జారీ చేస్తూ 6.45 నుంచి 11.5 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.