
బషీర్బాగ్, వెలుగు: ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే మంచి కమీషన్ వస్తుందని నమ్మించి ఓ యువకుడిని ఆన్లైన్ స్కామర్లు నిండా ముంచారు. బేగంపేటకు చెందిన 27 ఏళ్ల యువకుడికి గోయిబిబో ఇండియా ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ ప్రతినిధులుగా టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కాల్ చేశారు. హోటల్స్ కు గూగుల్ ద్వారా రేటింగ్స్ ఇస్తే కమీషన్ ఇస్తామన్నారు. మొదట రెండు సార్లు రూ.970, రూ.17,109 కమీషన్ చెల్లించారు.
యువకుడిని ఓ గ్రూపులో చేర్చి ఇన్వెస్ట్ చేసిన వారికి అధిక లాభాలు వచ్చినట్లు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశారు. దీంతో స్కామర్లను నమ్మిన యువకుడు పలు దఫాలుగా రూ.3 లక్షల 50 వేల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ తరువాత స్కామ్ అని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం హెల్స్లైన్ నెంబర్ ద్వారా కంప్లయింట్ ఇచ్చాడు.