హైదరాబాద్, వెలుగు: మెడికల్ డివైజెస్ పార్కులో ఒకేసారి ఏడు కంపెనీలు ప్రారంభించడం సంతోషం కలిగిస్తోందని ఇండస్ట్రీస్, ఐటీ మినిస్టర్ కేటీ రామారావు చెప్పారు. 2017లో మొదలైన మెడికల్ డివైజెస్ పార్కులో ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. కరోనా టైములో సవాళ్లు ఎదురైనప్పటికీ, యూనిట్లు పెట్టడానికి ఎంట్రప్రెనూర్లు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ పార్కులో యూనిట్లు పెట్టడానికి 50 కంపెనీలు ఆసక్తి చూపించాయని, ఆ కంపెనీలు రూ. 1,424 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని కేటీఆర్ చెప్పారు. ఏడు వేల మందికి ఈ కంపెనీలు ఉపాధి కల్పిస్తాయన్నారు. ఎక్కువ ఎదగడానికి అవకాశమున్నదిగా మెడికల్ డివైజెస్, డయాగ్నస్టిక్స్ సెక్టార్‌ను తెలంగాణ రాష్ట్రం గుర్తించిందని పేర్కొన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇనొవేషన్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 2030 నాటికి తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ 100 బిలియన్ డాలర్లకు చేరుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఐ కేర్ ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆక్రితి తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను మెడికల్ డివైజెస్ పార్కులో ప్రారంభించింది. ఆక్రితి సహా ఏడు కంపెనీలు మొత్తం రూ. 265 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడు కంపెనీలు మొత్తం 1,300 మందికి జాబ్స్ ఇవ్వనున్నాయి. సుల్తాన్‌పుర్ వద్ద 302 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
