మాన్సూన్ టీమ్‌ 24 గంటలు పనిచేయాలి: రంగనాథ్

మాన్సూన్ టీమ్‌ 24 గంటలు పనిచేయాలి: రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్​(ఎంఈటీ) 24  గంటలు ప‌ని చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ సూచించారు. వాతావ‌ర‌ణ హెచ్చరిక‌ల‌ను ప‌రిశీలించి సిద్ధంగా ఉంండాలన్నారు. మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్​కాంట్రాక్టర్లతో పాటు  హైడ్రా మార్షల్స్‌, డీఆర్ ఎఫ్ మేనేజ‌ర్లు,  సూప‌ర్‌వైజ‌ర్లతో బుధ‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయన మాట్లాడారు.

 ప్రజ‌లు స‌మ‌స్యల్లో ఉంటే ప‌రిధిలు గీసుకొని ఉండాల్సిన ప‌ని లేద‌ని, ప‌క్క స‌ర్కిల్‌లో స‌మ‌స్య ఉన్నా అందరూ కలిసి పని చేయాలన్నారు.