
చెరువులు కబ్జా చేసిన వారిపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తోంది.
లేటెస్ట్ గా మైలార్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. అప్ప చెరువు ఎఫ్ టీఎల్ లో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు . 3 ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడ్డట్లు తోకల శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీని విలువ రూ. 75 కోట్లు ఉంటుందని చెప్పారు అధికారులు. దీంతో 13 భారీ కట్టడాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు.
ALSO READ | హైడ్రా తగ్గేదేలా : మియాపూర్ ఈర్ల చెరువులో అపార్ట్ మెంట్స్ నేల మట్టం
ఇప్పటికే హైడ్రా అధికారులు బాచుపల్లి,నిజాంపేట,శేర్లింగంపల్లి,మియాపూర్ లో ఎఫ్ టీఎల్ ,బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. నోటీసులివ్వకుండానే కూల్చివేస్తామని చెబుతున్నారు అధికారులు.