పాశమైలారం ప్రమాద స్థలంలోహైడ్రా సహాయక చర్యలు

పాశమైలారం ప్రమాద స్థలంలోహైడ్రా సహాయక చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాశమైలారం ప్రమాద స్థలంలో హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ డీఆర్ఎఫ్ టీమ్స్​ని అక్కడకు పంపించారు. ఎన్​డీఆర్ఎఫ్ టీమ్స్​తో కలిసి సహాయక చర్యలు కొనసాగించారు.

సోమవారం ఉదయం మొదలైన సహాయక కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. షిఫ్ట్​కు 55 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో మొత్తంగా 165 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.