
మల్యాల, వెలుగు: మల్యాల మండలం తాటిపల్లి శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో బుధవారం హైనా సంచారం కలకలం రేపింది. యార్డ్‌లోని బియ్యం గోదాం గద్దెపై తీవ్ర గాయాలతో ఓ కుక్క డెడ్‌బాడీని స్థానికులు గుర్తించారు. పక్కనే ఉన్న గుట్టల నుంచి చిరుత వచ్చి కుక్కపై దాడి చేసి ఉండొచ్చని పలువురు అనుమానించారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని పాదముద్రలు, కుక్క బాడీలోని గోర్ల గాట్లను కొలిచిన ఫారెస్ట్ సిబ్బంది చిరుత దాడి కాదని, హైనా దాడి అని నిర్ధారణకు వచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరేశ్ మాట్లాడుతూ హైనాతో ఎలాంటి భయం అవసరం లేదని, అయినప్పటికీ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.