భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత్‌‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇండియాకు అవసరమైన సాయం అందిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. ఇందులో భాగంగా యూనిసెఫ్ సంస్థకు గూగుల్ తరపున రూ.135 కోట్ల నిధులు అందిస్తామని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. భారత్‌‌కు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించారు. ఇండియాలో కరోనా ఉధృతిని చూసి సత్య నాదేళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌‌లో సహాయ చర్యలను కొనసాగించేందుకు సంస్థ వనరులను ఉపయోగిస్తామని చెప్పారు.

క్రిటికల్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ డివైజెస్‌‌ను కొనేందుకు మద్దతుగా నిలుస్తామంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు భారత్‌‌కు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ భారత్ కు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ లాంటి సేవింగ్ మెడికల్ ఎక్విప్ మెంట్ పంపుతామని బ్రిటన్ సర్కార్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొవిడ్ కేసుల్లో అత్యధికంగా భారత్‌‌లోనే నమోదవుతున్నాయి.