సొంత పద్ధతుల్లో ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యా: రోహిత్ శర్మ

సొంత పద్ధతుల్లో  ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యా: రోహిత్ శర్మ

సిడ్నీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా పరాజయం పాలైనా.. లెజెండరీ క్రికెటర్ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ మాత్రం హిట్టయ్యాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనంతరం చాన్నాళ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత బరిలోకి దిగిన హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఓ సెంచరీ, ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఆడిన తొలి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మునుపటి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. తన సొంత పద్ధతుల్లో చేసిన ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కారణమని రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు.  

ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ కంటే లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయాల్సినవి చాలా ఉన్నాయనే ఆత్మపరిశీలన తర్వాత  తనదైన స్టయిల్లో ప్రిపేర్ అయ్యానని అతను స్పష్టం చేశాడు. సిడ్నీలో శనివారం జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ అజేయ సెంచరీతో ఇండియాకు భారీ విజయాన్ని అందించాడు. దీంతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతిలో వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాష్ కాకుండా తప్పించుకుంది. 

మే నెలలో ఐపీఎల్ తర్వాత మళ్లీ పోటీ క్రికెట్ ఆడింది ఇప్పుడే అయినప్పటికీ, రోహిత్ అద్భుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ విజయం వెనుక ఉన్న రహస్యాన్ని అతను బీసీసీఐ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘నేను ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సిద్ధం కావడానికి 4–5 నెలల సమయం ఎప్పుడూ దొరకలేదు.

అందుకే ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాను. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగిలిన ప్రయాణంలో ఏం చేయాలో అర్థం చేసుకుంటూ, నా సొంత పద్ధతిలో సిద్ధమయ్యాను. ఇది నాకు బాగా కలిసొచ్చింది. కొన్నిసార్లు మనం వృత్తిపరంగా చేసే పనులకు అతీతంగా కూడా జీవితంలో చేయడానికి చాలా ఉందని గ్రహించడం ముఖ్యం. 

నాకు లభించిన ఈ సుదీర్ఘ సమయాన్ని మొదట నాకోసం నేను కేటాయించుకున్నాను. ఇండియాలో చాలా బాగా ప్రిపేర్ అయ్యాను.  కానీ, ఆస్ట్రేలియా కండిషన్స్‌‌కు, స్వదేశీ పరిస్థితులకు తేడా ఉన్నా, ఎన్నోసార్లు ఇక్కడ (ఆస్ట్రేలియాలో)ఆడిన అనుభవంతో నేను రిథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకోవడం ఈజీ అయింది’ అని రో హిత్ చెప్పుకొచ్చాడు. 

ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం

మూడో వన్డేలో తన సెంచరీతో పాటు, మరో లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీతో కలిసి చేసిన మ్యాచ్ విన్నింగ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌పై రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియాలో ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా జట్టుకు విజయాన్ని అందించేంత పెద్ద ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. మేం ఛేజింగ్‌‌ మొదలుపెట్టినప్పుడు, రెండు కొత్త  బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడం సవాలుగా అనిపించింది. 

పిచ్ మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై షైన్ పోయిన తర్వాత సులభం అవుతుందని మాకు తెలుసు. చాలా కాలం తర్వాత కోహ్లీతో అద్భుతమైన పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. చాలా కాలంగా మా ఇద్దరి మధ్య ఇలాంటి భాగస్వామ్యం లేదు. జట్టు కోణం నుంచి చూస్తే, ఈ కీలక పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ నెలకొల్పడం మంచి విషయం. 

శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ త్వరగా ఔటవడం, గాయపడిన శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో,  సీనియర్లుగా మా ఇద్దరిపై బాధ్యత పెరిగింది. మాకున్న అపార అనుభవాన్ని సరిగ్గా ఉపయోగించాం. మేం ఇద్దరం పిచ్‌‌పై గడిపిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం. మేమిద్దం చాలా క్రికెట్ కలిసి ఆడాము. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాము. మా ఇద్దరి అనుభవాన్ని బాగా ఉపయోగించుకున్నాం’ అని హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ పేర్కొన్నాడు.

హర్షిత్ ఆట బాగుంది

సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటమి పాలైనప్పటికీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో  కొన్ని సానుకూలాంశాలను గుర్తించాడు. ఆస్ట్రేలియాలో తొలిసారి వైట్-బాల్ క్రికెట్ ఆడిన యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణా పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జట్టుకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆస్ట్రేలియాలో తొలిసారి వైట్-బాల్ క్రికెట్ ఆడిన హర్షిత్ రాణా. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో (సిడ్నీ, అడిలైడ్)  అతను చూపిన ప్రతిభ అమోఘం’ అని అన్నాడు. 

తనతో పాటు కోహ్లీని చూడటానికి భారీ సంఖ్యలో స్టేడియాలకు వచ్చిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ఇండియా సపోర్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రోహిత్ థ్యాంక్స్ చెప్పాడు. ‘మేం ఎక్కడ ఆడినా, మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు నేను రుణపడి ఉంటాను. ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంతగానో ఆదరిస్తారు. వారు ఎప్పుడూ నిరాశపరచరు. దురదృష్టవశాత్తు మేం సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలవలేకపోయాం, కానీ ఇక్కడ ఆడటం చాలా ఆనందించాం. ఫ్యాన్స్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇది ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపాడు.