
‘ఫోరెన్సిక్’ అనే మలయాళ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రెబా మోనికాజాన్.. ‘సామజవరగమన’ చిత్రం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ తోనే తెలుగులో సూపర్ సక్సెస్‌ను అందుకున్న రెబా.. తన గురించి, తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘స్వతహాగా మలయాళీ అయినా బెంగళూ రులో పెరిగాను. చదువు తర్వాత కొన్ని యాడ్స్‌లో నటించి తద్వారా సినిమాల్లోకి వచ్చాను. అందులో ‘ఫోరె న్సిక్’ సినిమాకు మంచి పేరు వచ్చింది.
ఇక తెలుగులో ‘బ్రో’ సినిమా కోసం లుక్ టెస్ట్‌కు వచ్చాను. అందులో నటించ లేకపోయినా, అనుకోకుండా ‘సామజవరగమన’లో అవకాశం రావడం, అది సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది. మలయాళంతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగులో నటించిన ఈ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అల్లు అర్జున్ గారితో పాటు పలువురు డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నేను పోషించిన సరయు పాత్రను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
అందుకే ఈ సినిమా నాకు వెరీ స్పెషల్. కథలో ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అయితే ‘బిజిల్’లో నటించిన పాత్ర లాంటివి తెలుగులో కూడా చేస్తాను. పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. ‘బ్రో’ సినిమాకు పనిచేయలేకపోయినా భవిష్య త్తులో ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం తెలుగులో కొన్ని కొత్త స్క్రిప్ట్స్ వింటున్నా. మలయాళంలో ఓ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది’ అని చెప్పింది.