ఆలేరు అభివృద్ధికి సహకరిస్తా.. మున్సిపల్ బడ్జెట్ ప్రిపరేషన్ మీటింగ్ లో MLA బీర్ల అయిలయ్య

ఆలేరు అభివృద్ధికి సహకరిస్తా.. మున్సిపల్ బడ్జెట్ ప్రిపరేషన్ మీటింగ్ లో MLA బీర్ల అయిలయ్య

యాదాద్రి, వెలుగు : ఆలేరు మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరిస్తానని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. చైర్​పర్సన్​ బాలమణి అధ్యక్షతన జరిగిన 2026-27 బడ్జెట్ ప్రిపరేషన్​ స్పెషల్​ మీటింగ్​లో ఆదాయం, కేటాయింపులపై చర్చ జరిగింది.  అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ లాంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎండాకాలం సమీపిస్తున్నందున తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు.