
- పది రోజులుగా స్కూల్‌కు రాని ఎస్సెస్సీ స్టూడెంట్
- చెప్పినా స్పందించని పేరెంట్స్
- ఇంటికి వెళ్లి బైఠాయించిన టీచర్
- సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘటన
కోహెడ (బెజ్జంకి) వెలుగు : బడికి రాని స్టూడెంట్లకు పనిష్మెంట్ ఇచ్చి భయపెట్టి రప్పిస్తున్న రోజుల్లో ఓ టీచర్ వినూత్నంగా ఆలోచించాడు. అసలే ఎస్సెస్సీ విద్యార్థి కావడం, తల్లిదండ్రులు చెప్పినా వినకపోవడంతో ఇంటికి వెళ్లి బైఠాయించాడు. తనతో స్కూల్‌కు వచ్చేంత వరకు లేచేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఎట్టకేలకు టీచర్వెంట స్కూల్‌కు వెళ్లడంతో కథ సుఖాంతమైంది. ఈ ఆసక్తికర ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బెజ్జంకికి చెందిన జెర్రిపోతుల నవీన్స్థానిక గవర్నమెంట్బాయ్స్స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పది రోజులుగా నవీన్స్కూల్కు వెళ్లడం లేదు. తల్లిదండ్రులకు చెప్పినా వారి నుంచి స్పందన లేదు.
దీంతో ఇంగ్లీష్ టీచర్ బీవీ ప్రవీణ్‌కుమార్ మంగళవారం నవీన్ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న నవీన్‌ను ఎందుకు బడికి రావడం లేదని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. కనుక్కుంటే ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నాడని తెలిసింది. తల్లిదండ్రులను ప్రశ్నించగా తాము పొద్దున పొలానికి పోతే సాయంత్రానికి వస్తామని, తమ కొడుకును స్కూల్‌కు వెళ్లాలని చెప్తున్నా వినడం లేదని వాపోయారు. దీంతో నవీన్బడికి వచ్చేదాకా అక్కడి నుంచి లేవనని బైఠాయించాడు. తల్లిదండ్రులు నవీన్‌కు ఎంత నచ్చచెప్పినా వినలేదు. ఎంతకూ సార్ లేచే పరిస్థితి కనిపించకపోవడంతో నవీన్ ఆయన వెంట బడికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు టీచర్ ప్రవీణ్‌ను అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రవీణ్లా ఉండాలని మెచ్చుకున్నారు.