బరేలీ అల్లర్లు.. తఖ్వీర్ రజా అరెస్ట్

బరేలీ అల్లర్లు.. తఖ్వీర్ రజా అరెస్ట్

ఉత్తరప్రదేశ్​ లోని బరేలీలో అల్లర్లకు కారణంగా భావిస్తున్న స్థానిక మతగురువు తఖ్వీర్​ రజా ను అరెస్ట్ చేశారు యూపీ పోలీసులు. శుక్రవారం ప్రార్థనల అనంతరం అతని ప్రోత్సాహంతోనే ఐ లవ్​ మహమ్మద్ ర్యాలీ జరిగిందని, అల్లర్లు చెలరేగాయని పోలీసులు ఆరోపించారు. తఖ్వీర్​ రజా తోపాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ అల్లర్లతో సంబంధమున్న వారిపై 10 కేసులు నమోదు చేశారు. ఇందులో 7 కేసులు తఖ్వీర్​ రజాపై నమోదు చేశారు పోలీసులు. 

బరేలీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత కొత్వాలి ప్రాంతంలోని మసీదు వెలుపల ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లను పట్టుకున్న పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. రజా పిలుపునివ్వడంతోనే నిరసన కారులు చివరి నిమిషంలో జనం హింసకు ప్రేరేపించబడ్డారని పోలీసులు ఆరోపించారు.
రాజాను జైలుకు పంపించారు.

Also Read : నాటకాలు ఆపండి.. ఉగ్రవాదులను పెంచి పోషించేదే మీరు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రజాతో సహా ఎనిమిది మందిని జైలుకు పంపారు. రాళ్ల దాడి, విధ్వంసం జరిగిన ఈ ఘర్షణ తర్వాత మొత్తం 39 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలం నుంచి అధికారులు పిస్టల్స్, పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో 22 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని, సంఘటనా స్థలం నుంచి రాళ్లు,పెట్రోల్ బాటిళ్లు,పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

నిరసనకారులు బారికేడ్లను దాటుకుని హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్, మాన్యువల్ ఇంటెలిజెన్స్ ,ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా అధికారులు హింసలో పాల్గొన్న వారందరినీ గుర్తిస్తున్నారు.