హిందూత్వను నమ్ముతా… గౌరవిస్తా : ఊర్మిళ

హిందూత్వను నమ్ముతా… గౌరవిస్తా : ఊర్మిళ

బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. తాను హిందూత్వాన్ని నమ్ముతాననీ… హిందూయిజాన్ని గౌరవిస్తానని చెప్పారు. హిందూ మతాన్ని విమర్శించానంటూ వచ్చిన వార్తలను ఆమె తప్పుపట్టారు. కేసు నమోదు కావడం కూడా కల్పితమని అన్నారు. ఆధారం లేని ఆరోపణలు తనపై చేస్తున్నారని.. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ దానిని నమ్మవద్దని కోరారు ఊర్మిళ మాతోండ్కర్.

“నాపై కేసు నమోదు కావడం.. పోలీసులకు ఫిర్యాదు అందడం అనేది పూర్తిగా కల్పితం. పోలీసులకు అందిన ఫిర్యాదులో నాపై పూర్తి ఆధారం లేని ఆరోపణలు చేశారు. ఇలాంటి అబద్దాలు ఎవరూ నమ్మోద్దు” అని ఆమె చెప్పారు.

హిందూత్వంలో హింస పెరిగిపోయిందంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఊర్మిళ చెప్పారని… ఇటీవల ముంబై పోలీసులకు కంప్లయింట్ చేశారు బీజేపీ నాయకుడు సురేష్ నఖువా. సహనానికి మారుపేరైనా హిందూమతం.. హింసాత్మకంగా మారారని చెప్పడం విద్వేషం రగిల్చడమే అవుతుందని అన్నారు. తప్పుడు, రెచ్చగొట్టే, మాయ మాటలు చెప్పిన ఆమెపై కేసు పెట్టాలని పోలీసులను కోరారు.

ఊర్మిళ మాతోండ్కర్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరి… నార్త్ ముంబై సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 29న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ సెగ్మెంట్ నుంచి ఇవాళ ఊర్మిళ నామినేషన్ వేశారు.