ఫ్రొఫెసర్ వార్నింగ్ : అడుక్కుంటారో..దొంగతనం చేస్తారో: ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్ ఉండాల్సిందే

ఫ్రొఫెసర్ వార్నింగ్ : అడుక్కుంటారో..దొంగతనం చేస్తారో: ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్ ఉండాల్సిందే

ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యార్ధులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్ధులు తప్పని సరిగా ల్యాప్ ఉండాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల్లో విద్యార్ధులకు జరిగే క్లాసు లు బ్లాక్ బోర్డ్ నుంచి డిజిటల్ వైపుకు పరుగులు పెట్టాయి. దీంతో ప్రతీ ఒక్క విద్యార్ధికి ల్యాప్ టాప్ తప్పని సరైంది. ల్యాప్ టాప్ లేకపోతే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవ్వడం చాలా కష్టం.

ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..బెంగళూరుకు చెందిన ఎంవీజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఆన్ లైన్ క్లాసులు వినాలంటే తప్పనిసరిగా ల్యాప్ లాప్ ఉండాల్సిందేనన్నారు. అంతటితో ఆగకుండా ల్యాప్ టాప్ కోసం యాచించండి, అప్పు చేయండి, దొంగతనం చేయండి. ల్యాప్ టాప్ ఉంటేనే క్లాసులకు అటెండ్ అవ్వండి అంటూ విద్యార్ధులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

చదువుకోవాలంటే డబ్బులు కావాలి. తినేందుకు డబ్బులు అవసరం లేదా..? ప్రభుత్వం ఎంతకాలం ఫ్రీగా ఫుడ్ పెడుతుంది. ప్రతీరోజు లైఫ్ ను లీడ్ చేయాలంటే తప్పని సరిగా డబ్బు కావాలి. ల్యాప్ టాప్ ఉండాలని ఎందుకు అంటున్నానంటే..మన జీవితంలో ల్యాప్ టాప్ ఒక భాగమైంది. డబ్బులు లేకుండా సినిమాకి వెళతారా..? నిర్లక్ష్యంగా ప్రశ్నలు అడగకుండా ల్యాప్ టాప్ లు తెచ్చుకోండి. క్లాసులు వినండి అంటూ హెచ్చరించారు.

ఫ్రొఫెసర్ వ్యాఖ్యలపై విద్యార్ధుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాల్లో ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలంటే చాలా కష్టం. ప్రతీ కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే రెండు ల్యాప్ టాప్ లు ఎలా కొనిపెట్టాలి  అంటూ ఓ తండ్రి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.