తల్లినయ్యాక డిప్రెషన్​లోకి వెళ్లా : కాజల్​ అగర్వాల్

తల్లినయ్యాక డిప్రెషన్​లోకి వెళ్లా : కాజల్​ అగర్వాల్

బిడ్డకు జన్మనివ్వడం ఓ వరమని.. అయితే అది అందరికీ ఒకేలా ఉండదని నటి కాజల్​ అగర్వాల్(Kajal Agarwal) ​ తెలిపింది. చాలా మంది తల్లులలానే తాను కూడా ప్రసవం అనంతరం పోస్ట్ పార్టమ్​ డిప్రెషన్​ను ఎదుర్కొన్నట్టు పేర్కొంది. తనను అలా చూసి భర్త గౌతమ్(Goutham kichlu)​ చాలా బాధపడ్డట్టు తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల వల్ల చాలా తొందరగా అందులోంచి బయటపడ్డానని కాజల్ వివరించింది.

ఇక ప్రతి మహిళ కూడా తల్లయ్యాక వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ట్రైనర్​ సాయంతో వర్కవుట్స్​ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం వంటివి ఎంతో అవసరమని సూచించింది. ఇక కుటుంబ సభ్యులు కూడా వారికి అండగా నిలవాలని కోరింది. కాజల్​ ప్రస్తుతం ‘ఇండియన్​ 2(Indian2)’ షూటింగ్​లో బిజీగా ఉంది. సత్యభామ(Sathyabhaama) అనే మరో లేడీ ఓరియెంటెడ్​ సినిమాలోనూ నటిస్తోంది.