ముస్లిం ఓట్లు వద్దు.. వేయమని కూడా అడగను : హిమంత బిస్వా శర్మ

ముస్లిం ఓట్లు వద్దు.. వేయమని కూడా అడగను  : హిమంత బిస్వా శర్మ

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచి తనకు ముస్లిం ఓటు వద్దన్నారు.  ఓటు వేయమని వారిని అడగనన్నారు. ఎందుకంటే అన్ని సమస్యలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే వస్తాయన్నారు బిస్వా శర్మ. తానూ  నెలకోసారి ముస్లిం ప్రాంతానికి వెళ్లి వారి కార్యక్రమాలకు హాజరవుతూ వారిని కలుస్తాను కానీ.. రాజకీయాలను అభివృద్ధితో ముడిపెట్టనని చెప్పారు. 

గత రాష్ట్ర ఎన్నికల్లో కూడా ముస్లిం ప్రాంతాల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు శర్మ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే వెళ్తానని చెప్పానన్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా వారికి మీకు నచ్చిన వారికి ఓటేయండని చెబుతాని.. వారి ప్రాంతంలో బీజేపీ కూడా  ప్రచారం చేయదన్నారు.   

తనకు ముస్లింలు ఓటు వేయకున్నా... రాబోయే 10 ఏళ్లలో వారిని అభివృద్ధి మార్గంలో నడిపిస్తానని శర్మ  చెప్పారు. బాల్య వివాహాలు ఆగిపోవాలని, వారు మదర్సాలకు వెళ్లడం మానేయాలని, కాలేజీలకు వెళ్లాలన్నారు.. ముస్లిం పిల్లల కోసం ప్రత్యేకంగా ఏడు కాలేజీలను ప్రారంభించబోతున్నానని  ..కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది అని ఆయన తెలిపారు.  ముస్లింలు కాంగ్రెస్‌తో తమకున్న బంధం అంతా ఓట్ల కోసమేనని గ్రహించాలని కోరుకుంటున్నానంటూ శర్మ చెప్పుకోచ్చారు. 

 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీలో 60 సీట్లు గెలుచుకున్న బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది.  2015 లో కాంగ్రెస్ లో నుంచి బీజేపీలో చేరిన శర్మ..  ర్బానంద సోనోవాల్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను కూడా నిర్వహించారు.  సర్బానంద సోనోవాల్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన స్థానంలో సీఎం అయ్యారు.