న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కొత్త చీఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ చీఫ్మార్షల్ వీఆర్. చౌధురీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అమర్ ప్రీత్ సింగ్ ఎయిర్ ఫోర్స్ లో వైస్ చీఫ్గా పని చేశారు. ఆయన1964, అక్టోబర్ 27న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజిల నుంచి చదువును పూర్తిచేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ స్ట్రీమ్ లో1984, డిసెంబర్ లో జాయిన్ అయ్యారు.