6 లక్షల 25 వేల కిలోల డబ్బు ట్రాన్‌పోర్ట్ చేశాం

6 లక్షల 25 వేల కిలోల డబ్బు ట్రాన్‌పోర్ట్ చేశాం

2016 నవంబరు 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నేరంద్ర మోడీ ఒక్క ప్రకటనతో రూ.1000, 500 నోట్లు రద్దయిపోయాయి. ఒక్కసారిగా ఆ అర్ధరాత్రి నుంచే పెద్ద నోట్లు చెల్లకుండా పోయాయి. కొత్తగా రూ.2000, రూ.500 నోట్ల చెలామణీలోకి తెచ్చింది భారత ప్రభుత్వం. తక్షణం వీటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కొత్త కరెన్సీ సరఫరా చేయాలి. ఇందుకు ఆ సయమంలో వేగంగా డబ్బు రవాణాకు భారత వాయుసేన విమానాలను ఉపయోగించింది ప్రభుత్వం. నోట్ల రద్దు తర్వాత ఏకంగా 6 లక్షల 25 వేల కిలోల కొత్త కరెన్సీని వారిలో దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చేశాయి ఎయిర్ ఫోర్స్ విమానాలు. ఈ విషయాన్ని నిన్న బాంబే ఐఐటీలో జరిగిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవ్.

ఎన్ని కోట్లు రవాణా చేశామో తెలియదు

పెద్ద నోట్ల రద్దు జరిగిన సమయంలో తాము ప్రజలకు వేగంగా డబ్బు అందడం కోసం ఐఏఎఫ్ విమానాల్లో ట్రాన్స్‌పోర్ట్ చేశామని చెప్పారు బీఎస్ ధనోవ్. 625 టన్నుల డబ్బును అప్పుడు రవాణా చేశామన్నారు. కోటి రూపాయలను 20 కిలోల బ్యాగ్‌లో ప్యాక్ చేసేవారని, అయితే మొత్తం ఎన్ని కోట్ల డబ్బు రవాణా చేశామన్నది తనకు తెలియదని చెప్పారు. కాగా, ధనోవ్ 2016 డిసెంబరు 31 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు.