బ్యాడ్ న్యూస్.. మన పైలట్ మిస్సింగ్: విదేశాంగ శాఖ

బ్యాడ్ న్యూస్.. మన పైలట్ మిస్సింగ్: విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: భారత్ పై దాడి చేసేందుకు పాకిస్థాన్ యుద్ధ విమానాలు ప్రయత్నిండంతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఐఏఎఫ్ జెట్ ఒకటి పాక్ లో పడిపోయిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఉదయం పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చి దాడి చేయాలని ప్రయత్నం చేశాయి. వాటిని మన ఎయిర్ ఫోర్స్ సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్ నుంచి వచ్చిన యుద్ధ విమానాల్లో ఒక దాన్ని కూల్చేసింది. కానీ దురదృష్టవశాత్తు పాక్ ను తిప్పి కొట్టే ప్రయత్నంలో ఒక మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం, ఓ పైలెట్ మిస్ అయ్యారు. అయితే ఆ పైలట్ తమ ఆధీనంలో ఉన్నారని పాకిస్థాన్  చెబుతోంది. దీనిలో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నాం’’ అని ఆయన చెప్పారు.

pakistan arrested indian pilot and aircraft shots

ఇద్దరంటున్న పాక్.. అధికార సమాచారం నిల్

మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లను అరెస్టు చేశామని ప్రకటించింది. ఒక పైలట్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చామని, మరో పైలట్ ను తమ అధికారులు ప్రశ్నిస్తున్నారని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ను ప్రశ్నిస్తున్నట్లు ఒక వీడియోను కూడా పాక్ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పాక్ మీడియా ద్వారా చెప్పడమే కానీ, నేరుగా భారత్ కు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ‘మీ యుద్ధ విమాన పైలట్ ను పట్టుకున్నాం’ అని పాక్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని భారత విదేశాంగ శాఖకు పంపలేదు.