వరుసగా రెండవ సారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా కుతురు చాలా గ్రేట్.. ఎందుకంటే తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్పీ క్లీయర్ చేసి ఐఏఎస్ ఆఫీషర్ అయ్యింది. రాజస్థాన్ లోని కోటా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయనకు ఆకాంక్ష బిర్లా,అంజలి బిర్లా ఇద్దరు కూతుళ్లు. ఓం బిర్లా భార్య అమిత. వీరి చిన్న కూతురు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 పరీక్షలో ఫస్ట్ అట్మెంట్ లోనే IAS అయ్యింది. ప్రస్తుతం ఆమె రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కోటాలోని సోఫియా స్కూల్‌లో చదువుకుంది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ (ఆనర్స్) పూర్తిచేసింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆగస్ట్ 2020లో రిజర్వ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో OBC, EWS మరియు SC సహా వివిధ వర్గాల నుండి 89 మంది అభ్యర్థుల పేర్లలో అంజలి బిర్లా కూడా ఉంది. ఈ విషయం తెలియగానే ఆమె మొదటి ప్రయత్నంలోనే ఎలా యుపిఎస్‌సి పాస్ అయ్యిందని, ఎలాంటి ఇంటర్యూలు, టెస్టులు లేకుండానే అంజలికి ఉద్యోగం ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తులు వచ్చాయి. తండ్రి రికమెండేషన్ తోనే ఐఏఎస్ అయిందని పుకార్లు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై అంజలి బిర్లా సిరియస్ అయ్యింది. ప్రోటో కాల్ ప్రకారమే తనకు ర్యాంక్ వచ్చిందని, ఆమె అడ్మిట్ కార్డ్ కాపీ, మెరిట్ లిస్ట్ లో రోల్ నంబర్, ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ కు అటెండ్ అయిన ప్రూఫ్స్ చూపించింది.
