పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పై ఐసీసీ ఆగ్రహం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పై ఐసీసీ ఆగ్రహం

పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే, మొదటి టెస్ట్ మ్యాచ్ రావల్పిండి వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ నిర్వాహనపై ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం ఐసీసీ స్టాండర్డ్స్, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కి తగ్గట్టు పిచ్ లేకపోవడమే అని తెలుస్తుంది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలించేలా ఉండటమే దీనికి కారణం అని తెలుస్తోంది.

దాంతో ఈ స్టేడియానికి సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. రావల్పిండి స్టేడియానికి ఈ రేటింగ్ రావడం వరుసగా ఇది రెండోసారి. ఈ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోనుంది. మళ్లీ ఇంకోసారి డీమెరిట్ పాయింట్ గనుక ఈ స్టేడియానికి వస్తే దాదాపు 12 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. అయితే, ఇంగ్లండ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో అతిథ్య పాకిస్థాన్ ఓడిపోయింది. మొదటి మ్యా్చ్ లో మొదటిరోజే 500 పరుగులు చేసి ఇంగ్లండ్ రికార్డ్ నెలకొల్పింది.