
- ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి
నిజామాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తున్న సిట్‌పై నమ్మకం లేదన్న కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో ఉన్న ఆయన స్టేట్ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సిట్‌పై నమ్మకం లేదనడం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర పరిధిలోని చట్టాలపై గౌరవం లేని బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణకు హాజరుకాకుండా చులకన చేయడం సరికాదన్నారు. చట్టాలను గౌరవించలేని ఆయనకు మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు.