
దుబాయ్: ఆసియా కప్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (సెప్టెంబర్) అవార్డును గెలుచుకున్నాడు. గత నెలలో ఏడు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 44.85 యావరేజ్, 200 స్ట్రయిక్ రేట్‌తో 314 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
అలాగే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లనూ సాధించాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్రియాన్ బెన్నెట్ (జింబాబ్వే) నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు అభిషేక్‌కు అవార్డు దక్కడం విశేషం. విమెన్స్ కేటగిరీలో స్మృతి మంధానాకు ఈ పురస్కారం లభించింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 77 యావరేజ్, 135 స్ట్రయిక్ రేట్‌తో 308 రన్స్ చేయడం మంధానాకు కలిసొచ్చింది.
ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గానూ రికార్డులకెక్కింది. తజ్మిన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా), సిద్రా అమిన్ (పాకిస్తాన్) అవార్డు రేసులో వెనకబడ్డారు.