సౌతాఫ్రికా టార్గెట్ 186

సౌతాఫ్రికా టార్గెట్ 186

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ బ్యాట్ మెన్స్ విజృంభించారు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ సఫారీ బౌలర్లను చీల్చిచెండారు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో పాక్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ... తర్వాత వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ బ్యాట్ ఝులిపించారు. దీంతో సౌతాఫ్రికాపై భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన పాక్.. 185 పరుగులు చేసింది. 

38 పరుగులకే రిజ్వాన్ (4), బాబర్ అజమ్ (6) పెవిలియన్ చేరారు. అనంతరం వచ్చిన మహ్మద్ హరీస్, షాన్ మసూద్ లు జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించారు. మసూద్ (2) త్వరగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ హరీస్ కు జతగా ఇఫ్తికార్ అహ్మద్ కలిశాడు. వచ్చి రాగానే అహ్మద్ చెలరేగిపోయాడు. హరిస్ (28) రన్లు చేసి అవుట్ అయ్యాడు. 35 బంతులను ఎదుర్కొన్న ఇఫ్తికార్ 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఏడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన షాదాబ్ ఖాన్ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కేవలం 22 బంతులను ఎదుర్కొని హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టు స్కోరు 177 వద్ద షాదాబ్ ఖాన్ (52) అవుట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 185 పరుగులు చేసింది. 

186 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన సఫారీ టీం ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఏమి పరుగులు చేయకుండానే.. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (0) అవుట్ అయ్యాడు. 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిలీ రోసౌవ్ (7) కూడా తొందరగా వెనుదిరిగాడు. 4.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది.