టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన శ్రీలంక

V6 Velugu Posted on Sep 12, 2021

కొలంబో: టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వచ్చే నెల 17 నుంచి ఐసిసి టి20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. 2014లో టి20 ప్రపంచ చాంపియన్ గా నిలిచిన శ్రీలంక ఈసారి నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఇప్పటికే అర్హత సాధించిన జట్లతో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడి విజయం సాధిస్తేనే సూపర్‌ 12కు అర్హత సాధిస్తుంది. శ్రీలంక ఉన్న గ్రూప్‌-ఎలో అన్నీ పసికూన జట్లే. నమీబియా, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. 
శ్రీలంక ఆడిన గత 5 టి20 సిరీస్‌లలో ఒకే ఒక్కటి అది కూడా భారత్‌-బి జట్టుపై నెగ్గింది. ఇప్పుడు దాసన్‌ షనక సారథ్యంలో టి20 ప్రపంచకప్‌లో సత్తాచాటి పూర్వ వైభవం సంతరించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టి20 ప్రపంచకప్‌ వచ్చే నెల అక్టోబరు 17 తేదీన ప్రారంభమై నవంబరు 14న ముగుస్తున్న విషయం తెలిసిందే. 

శ్రీలంక జట్టు: దాసన్‌ షనక(కెప్టెన్‌), ధనంజంయ డి సిల్వా (వైస్‌ కెప్టెన్‌), కౌసల్ పెరీరా, దినేష్‌ చండీమల్‌, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, చరిత్‌ అసలంక, వనిందు హసరంగ, కమిందు మెండిస్‌, చమిక కరుణరత్నె, మహీష్ తీక్షణ, ప్రవీణ్ జయ విక్రమ, నువాన్‌ ప్రదీప్‌, దుషమంత చమీర, లాహిరు మధుషంక.  రిజర్వు ఆటగాళ్లు: లాహిరు కుమార,బినురా ఫెర్నాండో,అఖిల ధనంజయ,పునులియా తరంగ.
 

Tagged , ICC T20 World cup 2021, Sri Lanka squad, 15 members squad of Srilank, t20 World Cup tournament, Srilanka team

Latest Videos

Subscribe Now

More News