టీమిండియా గెలవాలంటూ అభిమానులు పూజలు

టీమిండియా గెలవాలంటూ అభిమానులు పూజలు

ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ జట్టు విజయం కోసం అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.  ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు కోసం  ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో పూజలు చేశారు.  వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. క్రికెటర్ల ఫోటోలు, జాతీయ జెండాలతో పూజలు నిర్వహించారు అభిమానులు.  ఇవాళ్టి సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ పై గెలిస్తే... ఈ ఆదివారం పాకిస్తాన్ తో  జరిగే ఫైనల్లోనూ భారత జట్టు విక్టరీ కొడుతుందని అభిమానులు అంటున్నారు. 

కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, విరాట్‌‌‌‌ కోహ్లీ, సూర్యకుమార్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్‌ లో ఉండడం టీమిండియాకు ‌‌‌ప్లస్‌‌‌‌ పాయింట్ గా చెప్పుకోవాలి.  ఇద్దరిలో ఒక్కరు చెలరేగినా ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. వీళ్లకు టాపార్డర్‌‌‌‌లో రోహిత్‌‌‌‌.. మిడిలార్డర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌  కూడా తోడైతేనే  జట్టు భారీ స్కోరు చేయగలదు. సూపర్‌‌‌‌12లో ఇండియా ఐదింటిలో నాలుగు గెలిచింది. కానీ, ప్రతీసారి తుది జట్టు ఎంపికపైనే చర్చ నడుస్తోంది.